
యానాం, 04 మే (హి.స.)
యానాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు మరోసారి విజయం సాధించారు. పుదుచ్చేరి పరిధిలోని యానాం నియోజకవర్గం (పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం) నుండి వరుసగా 5 సార్లు (1996 నుండి 2021 వరకు) ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. తాజాగా 2026 ఎన్నికల్లో కృష్ణారావు సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్పై 4,568 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారుఈ ఎన్నికల్లో మొత్తం 35,840 ఓట్లు పోలవగా మల్లాడికి కృష్ణారావుకు 19,863, అశోక్కు 15,295 ఓట్లు వచ్చాయి. కాగా, మల్లాడి పర్యాటక, రెవెన్యూ, ఫిషరీస్, పౌర విమానయాన, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. అలాగే మూడుసార్లు ఉత్తమ ఎమ్మెల్యే పురస్కారం అందుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi