డివిజన్ స్థాయి ప్రజావాణికి ఆదరణ.. 30 రోజులలో సమస్యకు పరిష్కారం..
డివిజన్ స్థాయి ప్రజావాణికి ఆదరణ.. 30 రోజులలో సమస్యకు పరిష్కారం..
ప్రజావాణి


జోగులాంబ గద్వాల, 04 మే (హి.స.) ప్రభుత్వం నూతన విధానంతో అమలు

చేస్తున్న డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డ్లో సోమవారం డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని ఆర్డీఓ శ్రీనివాసరావు సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉండవెల్లి, అలంపూర్, మానవపాడు మండలాలకు చెందిన వివిధ గ్రామాల ప్రజలు తమ దరఖాస్తులతో తరలి వచ్చి ప్రజావాణిలో అర్జీలు సమర్పించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, భూ సంబంధిత సమస్యల పై వారు అర్జీలు సమర్పించారు. ప్రజలు సమర్పించిన అర్జీలను ఆన్లైన్లో నమోదు చేసి, అర్జీదారులకు రసీదులు అందజేశారు. 30 రోజుల్లో మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆర్డీఓ శ్రీనివాసరావు అర్జీదారులకు భరోసా కల్పించారు.

ప్రభుత్వం డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రశంసలు లభిస్తున్నాయి. అలంపూర్ నియోజకవర్గ ప్రజలు గతంలో ఏ సమస్య ఉన్నా ప్రజావాణిలో అర్జీ చేసుకోవడానికి 100 కిలోమీటర్ల దూరం గద్వాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం డివిజన్ స్థాయి ప్రజావాణి అలంపూర్ చౌరస్తాలో నిర్వహించడంతో సుమారు 20 కిలోమీటర్ల పరిధిలోనే అందరికీ అందుబాటులోకి రావడంతో ప్రజలకు దూర భారం తగ్గిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande