హత్యకేసును చేదించిన పోలీసులు
హత్యకేసును చేదించిన పోలీసులు
హత్యకేసును చేదించిన పోలీసులు


తిరుపతి , 06 మే (హి.స.) : ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో వృద్ధురాలిని హతమార్చి నగదు, నగలు కాజేసిన జంటను అరెస్టు చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఈరోజు డీపీవోలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. చెర్లోపల్లిలో ఈ నెల 1వ తేదీ రాత్రి ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు లోకేశ్వరి (68) మృతి చెందారు. మరుసటి రోజు ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా శరీరంపై గాయాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. ఇంటి పైన అద్దెకుంటున్న రెడ్డెప్ప, మహాలక్ష్మి ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు పక్కా ప్రణాళికతో ఈ హత్య చేసినట్లు వెల్లడైందని ఎస్పీ వివరించారు. మెడలోని నగలు, బీరువాలోని రూ.50 వేలు దోచుకువెళ్లారని, నగలు అమ్మేందుకు యత్నించగా గిల్టు నగలుగా తేలాయని, డబ్బుతో విజయవాడ పారిపోయేందుకు కాలూరు క్రాస్ వద్ద ఉండగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారన్నారు. వారి నుంచి గిల్టు నగలు, రూ.14 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లో కేసు ఛేదించిన సీఐ మద్దయ్యాచారి, ఎస్ఐ లోకేశ్కుమార్, శ్రీరామ్, జ్యోతిని ఆయన అభినందించారు.

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande