
అనంతపురం, 06 మే (హి.స.)రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం రూరల్ మండలం, కక్కలపల్లి మామిడి మార్కెట్ ను ఎమ్మెల్యే పరిటాల సునీత రైతులు, మార్కెట్ నిర్వాహకులు, వ్యాపారస్తులతో కలిసి పరిశీలించారు.
ఈరోజు ఒక టన్ను సాధారణ మామిడి పండ్ల ధర 47వేల రూపాయలు, కవరు కప్పి జాగ్రత్తలు తీసుకున్న మామిడి పండ్ల ధర ఒక టన్నుకు 80వేల రూపాయల వరకు రైతుకు గిట్టుబాటు అయింది. అనంతరం గ్రేడింగ్ ద్వారా బాక్సులలో ప్యాక్ చేసి భారతదేశ వ్యాప్తంగా ఎగుమతి చేస్తున్న వైనాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మమేకమై, రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపారస్తులు పట్టికలో పేర్కొన్న ధరల కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నారా లేదా అనే విషయాన్ని ఆయన ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV