జగనన్న కాలనీ భూసేకరణలో భారీ కుంభకోణం: సలీం ఆరోపణలు
భూసేకరణలో భారీ కుంభకోణం:
ysrcp-leaders-massive-corruption-in-jagananna-colonies-across-andhra


ఆదోని, 06 మే (హి.స.)''జగనన్న కాలనీల్లో భారీ కుంభకోణం జరిగింది. సేకరించిన భూమి లెక్కల్లోనూ, దానికోసం వెచ్చించామని చెపుతున్న వేల కోట్ల రూపాయల్లోనూ తేడాలు భారీగానే ఉన్నాయి.ఆదోనిలో జగనన్న కాలనీల నిర్మాణానికి సేకరించిన భూముల్లో భారీ అవినీతి జరిగిందని టీడీపీ మైనార్టీ నాయకుడు ఉమ్మి సలీం ఈ రోజు బుధవారం ఆరోపించారు.

వైఎస్సార్సీపీ హయాంలో పేదలందరికీ ఇళ్లు పథకం పేరిట 13 ఉమ్మడి జిల్లాల్లో జరిగిన దోపిడీపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం లోతుగా విచారించింది. అందులో వెల్లడైన వివరాలతో ప్రభుత్వానికి ఇటీవల సమగ్ర నివేదిక సమర్పించింది. ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి కుమారుడితో పాటు పలువురిపై క్రిమినల్ చర్యలకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసింది.ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, ఆయన తనయుడు మనోజ్ రెడ్డిలు అమాయక రైతులను మోసం చేసి వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు.

వైఎస్సార్సీపీ గ్రామ స్థాయి నాయకులు మొదలు రాష్ట్ర స్థాయి నేతలు, ప్రభుత్వాధికారులు కుమ్మక్కై ఈ కుంభకోణానికి పాల్పడినట్లు నిర్ధారించింది. ఏ మాత్రం అవసరమే లేని భూములు, నివాసయోగ్యం కాని స్థలాల్ని ప్రభుత్వంతో కొనిపించటం, జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీలను అడ్డం పెట్టుకుని మార్కెట్ రేటుకు మించి ధర ఖరారు చేయించటం ద్వారా కోట్లలో లబ్ధి పొందినట్లు గుర్తించింది.రైతులను బెదిరించి, దౌర్జన్యంగా భూములు లాక్కుని, ఒక్కో రైతు వద్ద లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. బాధిత రైతులు మీడియా ముందుకు వస్తే, వారిని ప్రలోభపెట్టేందుకు అనుచరులు డబ్బులతో బేరసారాలు చేస్తున్నారని సలీం ఆరోపించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande