మామిడి రైతు కన్నీరు.,,, మెట్ట ప్రాంతాల్లో అపార నష్టం
మామిడి రైతు కన్నీరు.,,, మెట్ట ప్రాంతాల్లో అపార నష్టం
మామిడి


మామిడి పండ్లు కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త! కెమికల్స్లేని పండ్లను ఇలా గుర్తించండి..


చిత్తూరు, 06 మే (హి.స.)

చిత్తూరు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న ఆకాల వర్షాలు, బలమైన గాలులు మామిడి రైతులకు నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. బేనీషా, మల్లికా రకాలు మరో 10 రోజుల్లో చేతికి వస్తుందని భావించినా ప్రకృతి అనుకూలించలేదు. పలు మండలాల్లో వంద ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలినట్లు ఉద్యాన శాఖాధికారులు అంచనా వేశారు. తొలి దశలోనే పూత రాయిపోయినా, మిగిలిన పూతతో కాపు వచ్చి కాయపట్టినా, గాలివాన కారణంగా ఒక్కొ తోపులో దాదాపు 30 శాతం కాయలు రాలిపోయాయి. కవర్లు కట్టినా ప్రయోజనం లేకపోయిందని పలు ప్రాంతాల రైతులు ఆవేదన చెందుతున్నారు మెట్ట, గుట్ట ప్రాంతాల్లోని తోతాపురి చెట్లపై గాలివాన ప్రభావం ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande