రైతులకు చేదోడువాదోడుగా నిలుస్తున్న యాంత్రీకరణ ప్రక్రియ ప్రారంభం
రైతులకు చేదోడువాదోడుగా నిలుస్తున్న యాంత్రీకరణ ప్రక్రియ ప్రారంభం
రైతులకు చేదోడువాదోడుగా నిలుస్తున్న యాంత్రీకరణ ప్రక్రియ


చిత్తూరు , 06 మే (హి.స.)

రైతులకు చేదోడువాదోడుగా నిలుస్తున్న యాంత్రీకరణ ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలైంది.

కూలీల కొరతను అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నాళ్లుగా యంత్రపరికరాలను అందిస్తున్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ-సబ్ మిషన్ కింద ఈ ఏడాది ఖరీ్ఫకు ముందే పరికరాలను సమకూర్చేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. యంత్రాలపై సబ్సిడీకి కోసం ప్రభుత్వం జిల్లాకు రూ.2.23 కోట్లు విడుదల చేసింది. ఇందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం, జిల్లా వ్యవసాయ శాఖలు కార్యచరణ ప్రణాళిక రూపకల్పనకు కమిటీని ఏర్పాటు చేశాయి. ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని 1,18,386 మంది రైతులు 1,78,262 ఎకరాల్లో 22 రకాల పంటల సాగు చేయనున్నారు. సాగు ఆధారంగా రైతులకు ఎలాంటి పరికరాలు కావాలో వివరాలు సేకరించాలని మండల వ్యవసాయధికారులకు వ్యవసాయ జిల్లా స్థాయి అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

దరఖాస్తుల స్వీకరణ మొదలు

రైతులు యంత్రాలు, పరికరాల కోసం ఆన్లైన్/ రైతు సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మూడేళ్లలో కనీసం మూడు సీజన్లలో పంట వివరాలను ఈ-పంట నమోదు చేసుకున్న రైతులు దరఖాస్తు చేసుకునేందుకు ఆర్హులు. 2024-25లో సబ్సిడీ పొందినవారు అర్హులు కారు. కుటుంబంలో ఒక సభ్యుడు వ్యవసాయ యాంత్రీకరణ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు, మహిళా రైతులకు యూనిట్ ధరలో 50 శాతం, ఇతరులకు 40 శాతం రాయితీ ఇస్తారు. వ్యవసాయ రైతులకు 9 రకాల పరికరాలను సబ్సిడీపై అందించనుంది. ట్రాక్టర్ పనిముట్లు, విత్తడం, నాటడం, తవ్వే యంత్రాలు, స్ర్పేయర్లు, స్వీయ చోదక ఇంప్లిమెంట్స్, 40 హెచ్ఎపీ లోపు ట్రాక్టర్, మినీ ట్రాక్టర్, ఫవర్ టిల్లర్లు, హార్వెస్టింగ్, నూర్పిడి యంత్రాలు, ఎండుగడ్డి, మేత సామగ్రిని ఇవ్వనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande