
కదిరి, 06 మే (హి.స.) శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ఆదేశాల మేరకు కదిరిలో 'ఆపరేషన్ పీస్' పేరుతో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ శివ నారాయణ స్వామి నేతృత్వంలో ఈ రోజు బుధవారం ఉదయం 81 మంది రౌడీ షీటర్ల ఇళ్లలో సోదాలు జరిగాయి.ఈ తనిఖీలలో భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రౌడీషీటర్ వద్ద రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రౌడీషీటర్ ఇంట్లో ఒక కత్తి, రెండు కేజీల గంజాయి, మరో రౌడీషీటర్ ఇంట్లో సరైన లెక్కలు లేని ఆరు లక్షల ఎనిమిది వందల రూపాయల నగదు, 11 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్తులతో పాటు వారి కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో నిబంధనలను ఉల్లంఘిస్తే పీడీ యాక్ట్ లేదా పట్టణ బహిష్కరణ వంటి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వీరిలో యాక్టివ్ గా ఉన్న రౌడీషీటర్లపై మరల కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. నగరంలో రౌడీషీటర్లు ఇకపై ఆధిపత్యం చలాయించాలని ప్రయత్నం చేసినా, దందాలు, సెటిల్మెంట్లు చేసినా తీవ్రమైన చర్యలకు గురికావలసి ఉంటుందని హెచ్చరికలు పోలీసులు జారీ చేశారు. రౌడీషీటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు సైతం నగర పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV