ధర్మవరంలో దొంగల హల్చల్: ఏకంగా ఏటీఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లిన వైనం
ధర్మవరంలో దొంగల హల్చల్: ఏకంగా ఏటీఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లిన వైనం
thieves-on-the-loose-in-dharmavaram-one-of-them-even-stole


ధర్మవరం, 06 మే ( హి.స.)శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎంలో నగదు చోరీకి విఫలయత్నం చేసి, ఏకంగా ఆ యంత్రాన్నే ఎత్తుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక పార్థసారథి నగర్ ప్రధాన రహదారిలో ఉన్న ఐడీఎఫ్సీ (IDFC) బ్యాంకు ఏటీఎంలోకి తెల్లవారుజామున మాస్కులు ధరించిన ముగ్గురు దొంగలు చొరబడ్డారు. ముందుగా రాడ్లతో యంత్రాన్ని పగులగొట్టి నగదును దోచుకునేందుకు ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో, ఏటీఎంకు తాళ్లు కట్టి తాము వచ్చిన బొలెరో వాహనంతో లాగి బయటకు తీశారు. అనంతరం ఆ యంత్రాన్ని వాహనంలోకి ఎక్కించుకుని ఉడాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు వాహనంలో బత్తలపల్లి వైపు పరారైనట్లు గుర్తించారు. ఆ మార్గంలోని సీసీటీవీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande