నేటితో ముగిసిన పుష్కరాలు.. పుష్కర ఘాట్లో మంత్రి, ఎంపీల ప్రత్యేక పూజలు
భూపాలపల్లి, 01 జూన్ (హి.స.) సరస్వతీ అంత్య పుష్కరాల్లో భాగంగా చివరి రోజు సోమవారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే వేలాదిగా వచ్చిన వాహనాలు, లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో కాళేశ్వరం కిక్కిరిసిపోయింది. పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు శివుడికి ప
Kaleshwaram


భూపాలపల్లి, 01 జూన్ (హి.స.)

సరస్వతీ అంత్య పుష్కరాల్లో

భాగంగా చివరి రోజు సోమవారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే వేలాదిగా వచ్చిన వాహనాలు, లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో కాళేశ్వరం కిక్కిరిసిపోయింది. పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు శివుడికి ప్రీతికరమైన సోమవారం రోజున కాళేశ్వరం ఆలయంలో దర్శనానికి భారులు తీరారు. సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ కాళేశ్వరంలో పర్యటించి ప్రత్యేక నిర్వహించారు. ముందుగా సరస్వతి నది తీరంలో పుణ్యస్నానం ఆచరించి గోదావరి మాతకు చీర, పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. పూజలు

అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకోగా దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభస్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. తదుపరి పార్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆశీర్వచన మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు, ఆర్జేసీ ఎం.రామకృష్ణారావు, ఈవో ఎస్. మహేష్, ఆలయ చైర్మన్ మోహన్ శర్మ మరియు ధర్మకర్తలు ఆధ్వర్యంలో స్వామి వారి శేష వస్త్రాలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఆదివారం రాత్రి కాళేశ్వరం చేరుకున్న రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీ మాధవానంద సరస్వతి స్వామి సరస్వతి స్వామిజీ నవరత్న మాలా హరతిని వీక్షించారు. ఈ సందర్భంగా నవరత్న మాలా హరతిని వీక్షించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ బ్రహ్మశ్రీ మాధవానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ, భక్తులు సరస్వతి పుష్కర స్నానం ఆచరించి స్వామి వారి అనుగ్రహం పొందాలని, దేశ ప్రజలందరూ ఆకాంక్షించారు. ఆయురారోగ్యాలతో ఉండాలని

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత సంవత్సరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరస్వతి పుష్కరాలు ప్రారంభించారని, ఈసారి గవర్నర్ చేతుల మీదుగా అంత్య పుష్కరాలుగా ప్రారంభమవడం గర్వకారణమని తెలిపారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. లక్షలాది భక్తులు పాల్గొంటున్న ఈ మహోత్సవం విజయవంతంగా నిర్వహించడంలో అన్ని శాఖల సమన్వయం కీలకమని పేర్కొన్నారు. భక్తులు సరస్వతి నదిలో పుణ్యస్నానం చేసి, కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటే జ్ఞానం, మోక్షం పొందాలని ఆశిస్తూ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గత 11 రోజులుగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని తెలిపారు. వచ్చే సంవత్సరం రాబోయే గోదావరి పుష్కరాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు భారీ స్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వేయి కోట్లు గోదావరి పుష్కరాలకు కేటాయించినట్లు తెలిపారు. కాళేశ్వరం దేవాలయం అభివృద్ధికి ముఖ్యమంత్రి 200 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా జరిగాయని అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande