ప్రతిభావంతులైన యువతకు సువర్ణావకాశం.. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్, 01 జూన్ (హి.స.) రాజకీయాల్లోకి రావాలనుకునే ప్రతిభావంతులైన యువతకు కాంగ్రెస్ పార్టీ సువర్ణావకాశం కల్పిస్తోందని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సోమవారం గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్ర
మహేష్ కుమార్ గౌడ్


హైదరాబాద్, 01 జూన్ (హి.స.)

రాజకీయాల్లోకి రావాలనుకునే

ప్రతిభావంతులైన యువతకు కాంగ్రెస్ పార్టీ సువర్ణావకాశం కల్పిస్తోందని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సోమవారం గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనల నుంచి పుట్టిన 'టాలెంట్ హంట్' వినూత్న కార్యక్రమం వివరాలను వెల్లడించారు. పార్టీ అధికార ప్రతినిధుల నియామకంలో సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టామని ఆయన స్పష్టం చేశారు. దేశ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకం కావాలని రాహుల్ గాంధీ గారు సంకల్పించారు. అందుకోసమే పార్టీలకు అతీతంగా, కేవలం ప్రతిభ, సమాజ సేవ చేయాలనే దృక్పథం ఉన్న యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించడానికి ఈ టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నాం. అని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.

ఈ టాలెంట్ హంట్ ద్వారా అధికార ప్రతినిధులను ఎలా ఎంపిక చేస్తారో మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. జాతీయ రాజకీయాలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న వారితో పాటు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమైన 'లౌకికవాదం' (Secularism) పై గట్టిపట్టున్న వ్యక్తులను గుర్తించి అవకాశం కల్పిస్తామన్నారు. సమాజ సేవ చేయాలనే బలమైన కోరిక ఉండి, రాజకీయాల్లో రాణించాలనుకునే మంచి వ్యక్తులకు ఇదొక గొప్ప వేదిక కానుందని పేర్కొన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా కేవలం టాలెంట్, సమాజ సేవ చేసే దృక్పథం ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande