
హైదరాబాద్, 01 జూన్ (హి.స.)
నకిలీ ఇమ్మిగ్రేషన్ పత్రాలతో కౌలాలంపూర్ వెళ్ళేందుకు యత్నించిన ఓ వ్యక్తిని ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పొన్నుస్వామి అనే వ్యక్తి ఆదివారం ఎయిర్ ఏషియా ఏకే-68 విమానంలో కౌలాలంపూర్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అతని వద్ద ఉన్న పత్రాలను పరిశీలించిన ఇమిగ్రేషన్ అధికారులకు ప్రొటెక్షన్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ పత్రం ఫెక్ గా నిర్ధారించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..