పింఛన్లను రూ.4వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్
పింఛన్లను రూ.4వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్
వెంకటేశ్వర ప్రసాద్


అనంతపురం, 01 జూన్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లను రూ.4 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్

అన్నారు.

2024 ఎన్నికల హామీ మేరకు సూపర్ సిక్స్లో భాగంగా పింఛన్లను రూ.4 వేలకు పెంచారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ నగదు అందిస్తూ వృద్ధులకు సీఎం చంద్రబాబు తోడుగా ఉంటున్నారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 64 లక్షల మందికి పైగా పింఛన్ అందుకుంటున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు.

నగరంలోని జనశక్తి నగర్, ఎంజీ కాలనీ, రజక నగర్, అశోక్ నగర్ ప్రాంతాల్లో

లబ్ధిదారులకు వృద్ధాప్య పింఛన్లను ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాలనీలోని వృద్ధులను ఆమె ఆప్యాయంగా పలకరించారు. ఏపీలో సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని వారికి వివరించారు. పెన్షన్ల పంపిణీ సమయంలో గత ప్రభుత్వంపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు పెంచడానికి గొడ్డలి పార్టీ ఐదేళ్ల సమయం తీసుకుందని ఎద్దేవా చేశారు. వృద్ధులను పట్టించుకునే అలవాటు ఆ పార్టీకి లేదని విమర్శించారు.

ఏపీ బడ్జెట్ అనుకూలించకపోయినా సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి పెన్షన్ను రూ.4 వేలు చేశారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రశంసించారు. అలాగే వికలాంగులకు రూ.6 వేలు, రూ.10 వేలు, రూ.15 వేల చొప్పున కూటమి ప్రభుత్వం అందజేస్తోందని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధి వైపు పయనిస్తోందని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande