తిరుచానూరు అమ్మవారి సేవలో ఏపీ అసెంబ్లీ స్పీకర్
తిరుచానూరు అమ్మవారి సేవలో ఏపీ అసెంబ్లీ స్పీకర్
ap-assembly-speaker-chintakayala-ayyanna-patrudu-visits-tiruchan


తిరుచానూరు, 01 జూన్ (హి.స.)

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈ రోజు సోమవారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

ఆలయం వద్ద ఏపీ అసెంబ్లీ స్పీకర్ కి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏవిఎస్వో రాధాకృష్ణమూర్తి, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ కి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande