
శ్రీశైలం, 01 జూన్ (హి.స.) : శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది . సోమవారం మరియు వేసవి సెలవులు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు . ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి రావడంతో మల్లన్న ఆలయం భక్తులతో కిటకిట లాడుతుంది. దీంతో మల్లికార్జున స్వామి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతుంది.
క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలి వచ్చిన భక్తులు భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీ స్వామి వారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ముందుగానే ఆన్లైన్లో స్పర్శ దర్శనం టికెట్స్ పొందిన భక్తులకు మాత్రమే యధావిధిగా స్పర్శ దర్శనానికి మాత్రమే కొనసాగింపు వేసవి సెలవులు వారాంతపు సెలవులు కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని ముందస్తుగా శ్రీనివాసరావు కీలక నిర్ణయం క్షేత్రమంత భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది .
భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు . శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది మరోపక్క భక్తులు రద్దీ దృష్ట్యా శని,ఆది, సోమవారలో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేసిన అధికారులు,సామాన్య భక్తులకు ఉచిత,శీఘ్ర,అతిశీఘ్ర,దర్శనానికి క్యూలైన్ల ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు,ఆన్లైన్లో విఐపి బ్రేక్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు 2 విడతలుగా ఉదయం 7:30 రాత్రి 9 గంటలకు మాత్రమ బ్రేక్ స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్న అధికారులు,భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనార్థమై క్యూలైన్లు,కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం,బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV