అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డురిడ్డు కూడలి వద్ద హార్డ్వేర్ దుకాణంలో అగ్నిప్రమాదం
అమరావతి, 10 జూన్ (హి.స.) పాయకరావుపేట గ్రామీణం : అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డు కూడలి వద్ద ఉన్న ఓ హార్డ్వేర్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దుకాణంలోని ఎలక్ట్రిక్ సామగ్రి, మోటార్లు, పైపులు కాలి బూడిదయ్యాయి. సమాచారం అం
అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డురిడ్డు కూడలి వద్ద హార్డ్వేర్ దుకాణంలో అగ్నిప్రమాదం


అమరావతి, 10 జూన్ (హి.స.)

పాయకరావుపేట గ్రామీణం : అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డు కూడలి వద్ద ఉన్న ఓ హార్డ్వేర్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దుకాణంలోని ఎలక్ట్రిక్ సామగ్రి, మోటార్లు, పైపులు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande