రైతులకు పారదర్శకంగా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ చేయాలి
అమరావతి, 10 జూన్ (హి.స.) ఆదోని గ్రామీణం: రైతులకు పారదర్శకంగా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్లా కమర్ అన్నారు. ఆదోని పట్టణంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలను జాయింట్ కలెక్టర్ నూరుల్లా కమర్ బుధవారం తనిఖీ చేశారు. ప్రభ
రైతులకు పారదర్శకంగా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ చేయాలి


అమరావతి, 10 జూన్ (హి.స.)

ఆదోని గ్రామీణం: రైతులకు పారదర్శకంగా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్లా కమర్ అన్నారు. ఆదోని పట్టణంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలను జాయింట్ కలెక్టర్ నూరుల్లా కమర్ బుధవారం తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎరువులు పంపిణీ చేయాలన్నారు. గతేడాది పంట ఆధారంగా ఎరువుల కేటాయింపు జరగాలని అధికారులకు సూచించారు. కౌలు రైతులకు కార్డుల ద్వారా ఎరువులు అందించాలన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు బాధ్యతతో పనిచేస్తూ రైతులకు ఎరువులు అందేలా చూడాలన్నారు. ఎరువులకు సంబంధించిన యాప్పై రైతులకు అవగాహన కల్పించాలని సంగం జిల్లా అధ్యక్షులు అశోక ఆనందరెడ్డి జాయింట్ కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. జేసీ వెంట ఆదోని ఏడీఏ బాలవర్ధిరాజు, వ్యవసాయాధికారి సుధాకర్, ఏఈవోలు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande