టీఎంసీలో తిరుగుబాటు.. దీదీ నెత్తిన పాలు పోస్తున్న రాజ్యాంగ సవరణ!
కోల్‌కతా , 10 జూన్ (హి.స.)పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ తిరుగుబాటు ప్రకంపనలు రేపుతోంది. పార్టీకి చెందిన సుమారు 20 మంది లోక్‌సభ సభ్యులు మమతా బెనర్జీ నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక వర్గంగా ఏర్పడేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంద
Mamtha Banerjee


కోల్‌కతా , 10 జూన్ (హి.స.)పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ తిరుగుబాటు ప్రకంపనలు రేపుతోంది. పార్టీకి చెందిన సుమారు 20 మంది లోక్‌సభ సభ్యులు మమతా బెనర్జీ నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక వర్గంగా ఏర్పడేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సంఖ్యాబలం చూస్తే ఇది దీదీకి భారీ ఎదురుదెబ్బలా కనిపిస్తున్నా.. చట్టపరంగా మాత్రం రెబల్స్‌కే షాక్‌ తగిలే పరిస్థితి ఉందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.

లోక్‌సభలో టీఎంసీకి 28 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో 20 మంది తమవైపే ఉన్నారని తిరుగుబాటు వర్గం చెబుతోంది. అయితే రెండు మూడొంతుల మంది ఎంపీలు ఉన్నారనే కారణంతోనే అనర్హత నుంచి రక్షణ లభించదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి రాజకీయ చీలికలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన 91వ రాజ్యాంగ సవరణ ఇప్పుడు మమతా బెనర్జీ వర్గానికే అండగా నిలుస్తోందని విశ్లేషిస్తున్నారు.

ఒకప్పుడు రాజకీయ పార్టీల్లో చీలికలకు చట్టంలో కొంత వెసులుబాటు ఉండేది. శాసనసభ లేదంటే పార్లమెంట్‌లో మూడింట ఒక వంతు మంది సభ్యులు విడిపోయినా అనర్హత నుంచి రక్షణ పొందే అవకాశం ఉండేది. అయితే 2003లో జరిగిన 91వ రాజ్యాంగ సవరణతో ఆ నిబంధనను పూర్తిగా తొలగించారు. అప్పటి నుంచి స్ప్లిట్(చీలిక) అనే భావనకు చట్టపరమైన గుర్తింపు లేదు. ఇప్పుడు రక్షణ పొందాలంటే మెర్జర్(విలీనం) మాత్రమే మార్గంగా మిగిలింది

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande