ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణ ప్రాజెక్టులు
అమరావతి, 10 జూన్ (హి.స.)ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం రూ. 4,703 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణ ప్రాజెక్టులు


అమరావతి, 10 జూన్ (హి.స.)ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం రూ. 4,703 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో గుజరాత్‌లోని అహ్మదాబాద్ మెట్రో విస్తరణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణ ప్రాజెక్టులు ఉన్నాయి.

అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణ..

రూ. 2,169 కోట్ల అంచనా వ్యయంతో అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద దాదాపు 6.032 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో కారిడార్‌ను నిర్మిస్తారు. ప్రస్తుతం ఉన్న అహ్మదాబాద్-గాంధీనగర్ కారిడార్‌ను విమానాశ్రయం (ఎయిర్‌పోర్ట్), ప్రతిపాదిత కామన్వెల్త్ గేమ్స్ కాంప్లెక్స్‌తో ఈ లైన్ అనుసంధానిస్తుంది. భవిష్యత్తులో జరగబోయే ‘వరల్డ్ పోలీస్ గేమ్స్ 2029’, ‘కామన్వెల్త్ గేమ్స్ 2030’లను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా వసతులను అభివృద్ధి చేయనున్నారు. ఈ నిర్మాణ పనులు జోరందుకున్న సమయంలో దాదాపు 2,000 మందికి, అలాగే మెట్రో నిర్వహణ సమయంలో మరో 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande