పార్వతీపురం.మన్యం జిల్లా భామిని.మండలం లోని ప్రజలకు.మెరుగైన రెవెన్యూ సేవలు
అమరావతి, 20 జూన్ (హి.స.) భామిని: పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలోని ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించాలని ఎంపీడీవో ఎస్.వసంతకుమారి అన్నారు. భామిని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం రెవెన్యూ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత రెవెన్యూ శా
పార్వతీపురం.మన్యం జిల్లా భామిని.మండలం లోని ప్రజలకు.మెరుగైన రెవెన్యూ సేవలు


అమరావతి, 20 జూన్ (హి.స.)

భామిని: పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలోని ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించాలని ఎంపీడీవో ఎస్.వసంతకుమారి అన్నారు. భామిని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం రెవెన్యూ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత రెవెన్యూ శాఖలో విశిష్ట సేవలు అందించి, పదవీ విరమణ పొందిన వీఆర్వో కాళీప్రసాద్ పట్నాయక్ను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం రెవెన్యూ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడుతూ పలువురు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మణి ప్రభాకర్, మండల సర్వేయర్ రాజేశ్వరరావు, మండలంలోని వీఆర్వోలు, వీఎస్లు, వీఆర్ఏలు, డీలర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande