
అమరావతి, 20 జూన్ (హి.స.)
నిడదవోలు: చెత్త రహిత నియోజకవర్గంగా నిడదవోలును తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రాన్ని పూర్తి స్థాయి స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు సంకల్పానికి అనుగుణంగా శనివారం నిడదవోలు పట్టణంలో ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. నిడదవోలు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’థీమ్తో జరిగిన ఈ పారిశుద్ధ్య డ్రైవ్లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా వారి యూనిఫామ్ ధరించిన మంత్రి దుర్గేష్.. చీపురు చేత పట్టి, పట్టణ వీధుల్లోని చెత్తను స్వయంగా శుభ్రం చేసి, డస్ట్బిన్లో వేశారు. అనంతరం అధికార యంత్రాంగం, ప్రజలతో కలిసి ‘స్వచ్ఛాంధ్ర’ప్రతిజ్ఞ చేయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ