
అమరావతి, 20 జూన్ (హి.స.)
ఎడ్లపాడు: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. నెట్ జీరో కాన్సెప్టులో భాగంగా అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్లను సీఎం పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని ప్రజావేదిక వద్దకు చేరుకొని ‘అన్నదాతా సుఖీభవ - పీఎం కిసాన్ యోజన’ కార్యక్రమంలో పాల్గొని, రైతులతో ముచ్చటించనున్నారు. ప్రకృతి సేద్యం ద్వారా సాగు చేస్తున్న పంటల వివరాలను తెలుసుకోనున్నారు. అంతకుముందు హెలీకాప్టర్లో లింగంగుంట్ల చేరుకున్న సీఎం చంద్రబాబుకు కలెక్టర్ కృత్తికా శుక్లా, ప్రజా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ