5 గంటల్లో చేరేలా......ముదిగుబ్బ నుంచి కదిరికి ఫోర్లైన్ నేషనల్ హైవే
5 గంటల్లో చేరేలా......ముదిగుబ్బ నుంచి కదిరికి ఫోర్లైన్ నేషనల్ హైవే
5 గంటల్లో చేరేలా......ముదిగుబ్బ నుంచి కదిరికి ఫోర్లైన్  నేషనల్ హైవే


అనంతపురం, 20 జూన్ (హి.స.): ప్రస్తుతం జిల్లా నుంచి రాజధాని అమరావతి, విజయవాడకు వెళ్లాలంటే రోడ్డు ప్రయాణం భారంగా మారింది. రైళ్ల సౌకర్యమూ అంతంత మాత్రంగానే ఉంది. దీనికి తోడు అమరావతి రాజధాని అయినప్పటి నుంచి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విద్యాసంస్థలు వెలిశాయి. గతంలో హైద్రాబాద్లో చదవాలనే అలోచన ఉన్నవారంతా.. ప్రస్తుతం విజయవాడ, నూజివీడు పరిసరప్రాంతాల్లోని విద్యాలయాల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రయాణికుల రద్దీ అమాంతంగా పెరిపోయింది.

అందుకు తగిన విధంగా సౌకర్యాలు లేకపోవడంతో జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్యకు చెక్ పేట్టేలా ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాయి. బీకేవీ (బెంగళూరు, కదిరి, విజయవాడ) ప్రాజెక్టు ద్వారా మల్లికవేముల క్రాస్ వద్ద జంక్షన్ ఏర్పాటు చేసి జిల్లా నలుమూలల నుంచి రాజధాని అమరావతికి కేవలం 5 గంటల్లో చేరేలా రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నట్లు ఎన్హెచ్ అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగా రూ. 707 కోట్లతో ముదిగుబ్బ నుంచి కదిరి వరకు 4 లైన్ హైవే నిర్మించనున్నారు.

ఇటు అనంతపురం, అటు బెంగళూరు మార్గాలను మల్లికవేముల క్రాస్ వద్ద కలిపి.. అక్కడి నుంచి నేరుగా విజయవాడకు వెళ్లడానికి మార్గం సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటు అనంతపురం నుంచి కళ్యాణదుర్గానికీ ఫోర్లైన్ రోడ్డు ప్రతిపాదన దశలో ఉంది. అలాగే అనంతపురం నుంచి ఉరవకొండకు సంబంధించి కన్సల్టేషన్ స్థాయిలో ఉంది. గుత్తి - కర్ణాటకలోని బీదర్ హైవే విస్తరణ చేస్తున్నారు. దీంతో పాటు గుంతకల్లు - బళ్లారి రోడ్డు విస్తరణకు రూ.230 కోట్లతో నూతన టెండర్ పిలిచారు.

రాయదుర్గం పట్టణ ప్రారంభంలో రూ.54 కోట్లతో రైల్వే బ్రిడ్జి నిర్మాణం, పట్టణం ప్రారంభం వరకు రోడ్డు విస్తరణ పనులను కూడా చేపట్టనున్నారు. అలాగే ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి రోడ్డు విస్తరణకు రూ.25 కోట్లతో టెండర్ పిలిచారు.

దీంతో ఆ ప్రాంతంలో విస్తరణ పనులు చేపట్టలేదు. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేషనల్ హైవే అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande