
హైదరాబాద్, 24 జూన్ (హి.స.)
కేసీఆర్ హయాంలో ఇచ్చిన రైతు బంధును సక్కగా ఇచ్చినా కూడా రూ.30 వేల కోట్లు ఇంకా తెలంగాణ రైతులకి బాకీ ఉన్నావని విమర్శించారు. తెలంగాణ రైతులు రేవంత్ రెడ్డి మోసాలను గమనించాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న సర్ కార్యక్రమం ముగిసిన తరువాత ఎన్నికలకు వెళ్లనున్న దృష్ట్యా వానాకాలం రైతు బంధు వేస్తామని నాటకాలాడుతున్నారని, వానాకాలం, యాసంగి కాలం ఇవ్వాల్సిన బాకీని ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి బ్యాంకును కూడా బ్లాక్ మెయిల్ చేసే మొనగాడని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ( Jagadish Reddy ) బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) వ్యవహారంపై విరుచుకుపడ్డారు. రైతు బంధు విషయంలో మరోసారి మోసం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వానా కాలం రైతుబంధు వేస్తామని కొత్త డ్రామా మొదలుపెట్టారని విమర్శించారు. యాసంగి మీ తాత ఇస్తాడా? అంటూ చురకలు అంటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi