శాస్త్రీయ పరిశోధన ఫలితాలు రైతులకు చేరాలి
శాస్త్రీయ పరిశోధన ఫలితాలు రైతులకు చేరాలి
'Pradhan Mantri Kisan Samman Nidhi Yojana' has become a financial lifeline for 69 lakh farmer families of Gujarat


హైదరాబాద్, 24 జూన్ (హి.స.)

రైతులకు శాస్త్రీయ పరిశోధన ఫలితాలు చేరాలని ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ దండ రాజిరెడ్డి తెలిపారు. మంగళవారం శ్రీకొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో నిర్వహించిన 12వ రాష్ట్రస్థాయి సాంకేతిక కార్యక్రమంలో రాజిరెడ్డి మాట్లాడారు. ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తలు చేసే పరిశోధనల ఫలితాలు ఆలస్యం కాకుండా వెంటనే క్షేత్రస్థాయిలోని ఉద్యాన రైతులకు చేరాలని ఆకాంక్షించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని(ఐటీ), ఆధునిక కృత్రిమ మేధస్సు(ఏఐ)ను వినియోగించుకుంటూ శాస్త్రవేత్తల సలహాలు పాటించాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande