గ్రామాల రూపురేఖల్లో మార్పేది?: మంత్రి సీతక్క
గ్రామాల రూపురేఖల్లో మార్పేది?: మంత్రి సీతక్క
గ్రామాల రూపురేఖల్లో మార్పేది?: మంత్రి సీతక్క


హైదరాబాద్, 24 జూన్ (హి.స.)

రాష్ట్రంలోని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలో సుమారు 1.35 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారు.. ఏటా రూ.34 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చవుతున్నాయి.. భారీ యంత్రాంగం, నిధులు ఉన్నప్పటికీ గ్రామాల రూపురేఖలు ఆశించిన స్థాయిలో ఎందుకు మారడం లేదు? అని మంత్రి సీతక్క అధికారులను ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం పల్లెల ప్రగతికి వేల కోట్లు వెచ్చిస్తున్నా ఫలితమెందుకు రావడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. గ్రామాల అభివృద్ధి అంటే కేవలం భవనాలు, రోడ్లు నిర్మించడం మాత్రమే కాదని, గ్రామాల్లో నివసించే ప్రతి కుటుంబ జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే అసలు అభివృద్ధి అని తెలిపారు. మంగళవారం ప్రజాభవన్లో జిల్లా అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలు, డీపీవోలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, మిషన్ భగీరథ, సెర్ప్, ఉపాధి హామీ పథకం తదితర విభాగాల అధికారులతో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిశోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్యాదేవరాజన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande