నైరుతి రుతుపవనాల ప్రభావం తో తెలంగాణలో ఏడు రోజుల పాటు.భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాల ప్రభావం తో తెలంగాణలో ఏడు రోజుల పాటు.భారీ వర్షాలు
rain


హైదరాబాద్, 27 జూన్ (హి.స.)

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, ఖమ్మం, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబాబాద్, మంచిర్యాలు, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande