
విశాఖపట్నం, 29 జూన్ (హి.స.)
,:ముస్సోరీలో అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన టెకీ రాధాగాయత్రి తల్లిదండ్రులు ఈరోజు(సోమవారం) హోం మంత్రి అనితను కలిశారు. కూతురి మరణం, అల్లుడు శ్రీచరణ్ ప్రవర్తనపై అనుమానాలను హోం మంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం కావాలని రాధాగాయత్రి తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి కోరారు. ఇప్పటికే అక్కడి పోలీసులతో ఇన్ఛార్జి జాయింట్ సీపీ మాట్లాడి కేసుపై వివరాలను తీసుకున్నారని ఈ సందర్భంగా హోం మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని రాధాగాయత్రి తల్లిదండ్రులకు అనిత భరోసా ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ