హైదరాబాద్ టు చెన్నై, బెంగళూరు.. బుల్లెట్ రైలుకు మార్కింగ్ పనులు షురూ..
హైదరాబాద్ టు చెన్నై, బెంగళూరు.. బుల్లెట్ రైలుకు మార్కింగ్ పనులు షురూ..
Bullet train


హైదరాబాద్, 29 జూన్ (హి.స.)హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ నుంచి బెంగళూరు.. ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ అయ్యాయి. హైస్పీడ్ రైలు కారిడార్ల ప్రాజెక్టులో భాగంగా పలు పనులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఎలైన్మెంట్కు సంబంధించి క్షేత్రస్థాయిలో కసరత్తు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డి నుంచి నల్గొండ, వికారాబాద్ జిల్లాల వైపు సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో మార్కింగ్ చేస్తున్నాయి. హైదరాబాద్- చెన్నై కారిడార్కు శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, యాచారం మండలాల మీదుగా సర్వే చేస్తున్నారు. అలాగే హైదరాబాద్-బెంగళూరు కారిడార్కు శంషాబాద్, షాబాద్ మండలాలు, నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వైపు పది రోజులుగా సర్వే చేస్తున్నారు. పొలాలు, ఇతర ప్రాంతాల్లో ఎరుపు-తెలుపు రంగులతో ప్రత్యేక గుర్తులు వేస్తున్నారు.

యాచారం మండలంలోని కురుమిద్ద, మేడిపల్లి, మల్కిస్ గూడం, తక్కళ్లపల్లి, చింతపట్ల, నల్లవెల్లి, మందన, గౌరెల్లి గ్రామాల పరిధిలో మార్కింగ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. కారిడార్ ఎలైన్మెంట్, సర్వే పాయింట్లు, భూసేకరణ అవసరాలను గుర్తించేందుకు ఈ మార్కింగ్లు చేస్తున్నట్టు చెబుతున్నారు.

చెన్నై To హైదరాబాద్, హైదరాబాద్ To బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించి ఇప్పటికే ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రస్తుతం సాధ్యాసాధ్యాల అధ్యయనం కొనసాగుతోంది. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలో రూట్ ఖరారు చేసే పనుల్ని వేగవంతం చేశారు. సర్వే పూర్తయిన తర్వాత తుది అలైన్మెంట్, స్టేషన్లు, భూసేకరణ వివరాలపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు అధికారులు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande