
వరంగల్, 29 జూన్ (హి.స.) 10 ఏళ్ల బీఆర్ఎస్, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ఓరుగల్లుకు నయా పైసా దక్కలేదని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. వరంగల్లో ఈ రోజు జరిగిన సభలో ఆయన మాట్లాడారు. వరంగల్ కు మోదీ పెద్ద ఎత్తున నిధులిస్తే బీఆర్ఎస్ దుర్వినియోగం చేసిందని హైదరాబాద్ తరువాత అత్యధిక నిధులు కేటాయించేందని అన్నారు.
అయినప్పటికీ కేవలం చిన్న తేలికపాటి వర్షానికే నగరం మునిగిపోతుండటం చాలా బాధాకరమని తెలిపారు. అందుకే రాబోయే మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో వరంగల్ కార్పొరేషన్ ను బీజేపీని గెలిపించాలని అప్పుడు అభివృద్ధి అంటే ఏమిటో చుపిస్తామన్నారు.
అనంతరం వరంగల్ పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతూ... స్థానిక సమస్యలపై పోరుబాట పట్టాలని బీజేపీ కార్యకర్తలకు సూచించారు. లాఠీ దెబ్బలకు వెరవకుండా పోరాడాలని ఒక్కో కార్యకర్త ప్రతి ఇంటికి 6 సార్లు వెళ్లాలని సూచించారు. వరంగల్ కార్పొరేషన్ కు పూర్తి సమయమిస్తామని వరంగల్ మేయర్ పీఠాన్ని గెలిచి మోదీ, నబిన్ కు గిఫ్ట్ ఇద్దామని బండిసంజయ్ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్