ప్రజలకు అదిరిపోయే గుడ్న్యూస్.. జులై ఒకటి నుంచి కొత్త పథకం ప్రారంభం.. ఇదిగో పూర్తి వివరాలు
వికసిత్ భారత్ గ్రామీణ్ గ్యారంటీ మిషన్ (VB-GRAMG) కొత్త గ్రామీణ ఉపాధి పథకం అమలు
Mission


హైదరాబాద్, 29 జూన్ (హి.స.)గ్రామీన ప్రాంతాల్లోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సూపర్ గుడ్న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ గ్రామీణ్ గ్యారంటీ మిషన్ (VB-GRAMG) కొత్త గ్రామీణ ఉపాధి పథకాన్ని అమలు చేయనుంది. ఇది ప్రస్తుతం అమలులో ఉన్న మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ (MGNREGA) స్థానంలో వస్తుంది. జులై 2న దీని జాతీయ ప్రారంభోత్సవ కార్యక్రమం తిరుపతిలో జరగనుంది.. ఈ కొత్త పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీని మరింత బలోపేతం చేస్తూ, జీవనోపాధి అవకాశాలను విస్తరించడం, ఆదాయ వనరులను పెంచడం లక్ష్యంగా రూపొందించారు.

అసలు ఏంటీ ఈ VB-GRAMG పథకం

VB-GRAMG పథకం ముఖ్య ఉద్దేశ్యం గ్రామీణ కుటుంబాలకు ఉపాధి హామీని పెంచడం.మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) ద్వారా లక్ష్మీపతి దీదీల సృష్టించడం..గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సాంకేతికత వినియోగం.

ఇప్పటికే రాష్ట్రాలు తమ అమలు సన్నాహాలను పూర్తి చేసుకోవాలని కేంద్రం సూచించింది.ఈ పథకం అమలుతో దేశవ్యాప్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలపడటం సహా వికసిత భారత్ లో భాగంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్రం భావిస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande