అధికారుల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి : ఎమ్మెల్యే కూనమనేని
అధికారుల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి : ఎమ్మెల్యే కూనమనేని
Mla


కొత్తగూడెం, 29 జూన్ (హి.స.)

సింగరేణి అధికారుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, వారి ఉద్యమానికి పూర్తి మద్దతు ఉంటుందని కూనంనేని సాంబశివరావు అన్నారు. అఖిల భారత బొగ్గుగనుల అధికారుల సంఘం సింగరేణి శాఖ ఆధ్వర్యంలో సోమవారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట అధికారులు చేపట్టిన నిరసన దీక్షను ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ రాత్రింబవళ్లు శ్రమించి సింగరేణి సంస్థను లాభాల బాటలో నడిపిస్తున్న అధికారుల పట్ల యాజమాన్యం, ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని వీడాలని కోరారు. అధికారుల పే రివిజన్, అలవెన్సులు, ఇతర పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

అలాగే, అధికారులకు లాభాల్లో వాటా, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం యాజమాన్య బాధ్యత అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారుల సమస్యల పై తక్షణమే స్పందించి చొరవ చూపాలని, లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande