
శ్రీకాళహస్తి, 29 జూన్ (హి.స.): రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జూలై 1న శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నిర్వహించనున్న కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నేపథ్యంలో కొత్తపాలెం పరిధిలో సభా స్థలాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఈ రోజు సోమవారం ఉదయం పరిశీలించారు.
సభ నిర్వహణకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు, వేదిక పరిసర ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు,కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు,పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV