బెట్టింగ్లను నిషేధిస్తూ చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉంది : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, 03 జూన్ (హి.స.) ఆన్లైన్ బెట్టింగ్ అనేది (Online Betting) నైపుణ్యానికి సంబంధించిన ఆట అయినప్పటికీ దానికి రాజ్యాంగ రక్షణ ఉండబోదనే (Constitutional Protection) సుప్రీం కోర్ట్ (Supreme Court) తేల్చిచెప్పింది. వివిధ క్రీడలపై ఆన్లైన్ బెట్టింగ
సుప్రీం కోర్ట్


న్యూఢిల్లీ, 03 జూన్ (హి.స.) ఆన్లైన్ బెట్టింగ్ అనేది (Online Betting) నైపుణ్యానికి సంబంధించిన

ఆట అయినప్పటికీ దానికి రాజ్యాంగ రక్షణ ఉండబోదనే (Constitutional Protection) సుప్రీం కోర్ట్ (Supreme Court) తేల్చిచెప్పింది. వివిధ క్రీడలపై ఆన్లైన్ బెట్టింగ్లను నిషేధిస్తూ తమిళనాడు (Tamil Nadu), కర్ణాటక (Karnataka) చేసిన చట్టాల రాజ్యాంగబద్ధతను సమర్థించింది. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ అంశాలపై చట్టాలు రూపొందించేందుకు రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉందని జస్టిస్ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది.

సమాజ హితం, శాంతిభద్రతల దృష్ట్యా ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లపై నిషేధం విధించడాన్ని సమర్థిస్తున్నట్లు తెలిపింది. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల నిషేధానికి మార్గం సుగమమైంది. ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి యాప్లలో డబ్బులు పందెంగా పెట్టడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. అటువంటి ఆటలు ఆడడానికి నైపుణ్యం అవసరమైనా వాటిపై డబ్బులు పందేలు కాస్తే అది ‘జూదం' కిందకే వస్తుందని పేర్కొన్నది. ఆన్లైన్ వ్యసనాలవల్ల యువత అప్పుల పాలై, ఆత్మహత్యలు చేసుకుంటున్న సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఈ తీర్పు వెలువరిస్తున్నట్లు తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande