
బెంగళూరు, 03 జూన్ (హి.స.)
కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. లోక్భవన్ గ్లాస్ హౌస్లో బుధవారం మధ్యాహ్నం 4.05 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్తో గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ ప్రమాణస్వీకారం చేయించారు.కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీడీ సతీశన్, ఎ.రేవంత్ రెడ్డి, సుఖ్వీందర్ సింగ్ సుఖు, పలువురు ఆధ్యాత్మిక నేతలు, విద్యార్థి, పౌరకార్మిక, రైతు ప్రతినిధులు, దళిత నేతలు, కన్నడ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi