
పాట్నా:03 జూన్ (హి.స.)
బీహార్లో ఓ కోచింగ్ సెంటర్(Khan Coaching Centre)పై అటాక్ జరిగింది. ఎడ్యుకేటర్ ఫైసల్ ఖాన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఖాన్ సార్ కోచింగ్ సెంటర్గా ఆ ఇన్స్టిట్యూట్కు పేరున్నది. ఆ సెంటర్పై దుండగులు రాళ్లు రువ్వారు. ఫైరింగ్ కూడా జరిగినట్లు రూమర్స్ వస్తున్నాయి, కానీ పోలీసులు మాత్రం దీన్ని దృవీకరించలేదు. కదంకౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఖాన్ గ్లోబల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఖాన్ గ్లోబల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్పై జరిగిన అటాక్కు సంబంధించిన కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.సీసీటీవీ ఫూటేజ్ను పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు. సుమారు 20 మంది కోచింగ్ ఇన్స్టిట్యూట్ వద్దకు చేరుకుని హంగామా చేసినట్లు తెలుస్తోంది. రాళ్లు రువ్వి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత ఖాన్ సార్ మీడియాతో మాట్లాడారు. మరో కోచింగ్ సెంటర్కు చెందిన సంఘవిద్రోహ శక్తులు ఈ విధ్వంసానికి పాల్పడినట్లు ఖాన్ ఆరోపించారు. అల్లరిమూకలు తుపాకీ పేల్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. తక్కువ ఫీజుకే విద్యార్థులకు ఎలా బోధిస్తున్నారని, ఆ స్టూడెంట్స్ ఎలా ఫలితాలు సాధిస్తున్నారన్న అనుమానాలు కోచింగ్ సెంటర్లకు ఉన్నట్లు ఖాన్ ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi