వారణాసిలో 200 ఏళ్ల క్రితం నాటి మసీదు కూల్చివేత..
వారణాసిలో 200 ఏళ్ల క్రితం నాటి మసీదు కూల్చివేత..
వారణాసిలో 200 ఏళ్ల క్రితం నాటి మసీదు కూల్చివేత..


వారణాసి, 03 జూన్ (హి.స.)

సుమారు 200 ఏళ్ల క్రితం నాటి మసీదును వారణాసి(Varanasi)లో కూల్చివేశారు. కాశీ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ కోసం భూమిని క్లియర్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆ ప్రాంతంలో ఉన్న మసీదును కూల్చేశారు. రాజ్ఘాట్ సమీపంలోని అజ్గబీ షహీద్ మసీదు… రైల్వే ప్రాజెక్టు డిజైన్ ఏరియాలోనే ఉన్నది. అయితే భారీ భద్రత మధ్య ఆ మసీదును తొగించారు. స్టేషన్ ఆధునీకరణ కోసం మార్క్ చేసిన ప్రాంతంలో ఆ మసీదు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సుమారు 400 కోట్ల ఖర్చుతో కాశీ రైల్వే స్టేషన్ను పునర్ నిర్మించనున్నారు. రైలు, రోడ్డు, మెట్రో, వాటర్ ట్రాన్స్పోర్టు నెట్వర్క్ను సింగిల్ లొకేషన్లో కలపాలని కొత్త ప్లాన్ ద్వారా యోచిస్తున్నారు. మసీదు కూల్చివేతను చాలా తక్కువ టైంలో పూర్తి చేశారు. బుల్డోజర్ల ద్వారా మసీదు కట్టడాన్ని కూల్చేశారు. జాయింట్ పోలీసు కమీషనర్ శివ్ హరి మీనా సమక్షంలో కూల్చివేత జరిగింది. అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీసు, పారామిలిటరీ సిబ్బంది కూడా ఉన్నారు. అయిదు జేసీబీ మెషిన్లు, రెండు పోక్లాండ్ ఎక్స్కవేటర్లు వాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande