
హైదరాబాద్, 07 జూన్ (హి.స.)
హిట్లర్, తుగ్లక్ కలిస్తే రేవంత్ రెడ్డి..
అంటూ తెలంగాణ ముఖ్యమంత్రిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానానికి గులాంగిరీ చేస్తున్నారని చెప్పారు.
హైదరాబాదులో నేడు ఓ మీడియా ప్రతినిధితో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... దేశంలో తెలంగాణ నుంచే ఎఫ్బీఐ 60 శాతం ధాన్యం కొనుగోలు చేస్తోందని తెలిపారు. హిట్లర్ ప్లస్ తుగ్లక్ కలిస్తే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నేతృత్వంలో అసమర్థ పాలన కొనసాగుతోంది. సోనియా గాంధీ కుటుంబానికి సలాం చేసేది రేవంత్ రెడ్డి.
పదవి కాపాడుకోవడానికి కడుతున్నారు. 11 ఏళ్లలో కేంద్రం తెలంగాణకు రూ.13 లక్షల కోట్లు కేటాయించింది. తెలంగాణ కట్టిన పన్నుల్లో సోనియాకు పన్నులు 80 శాతం కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇచ్చింది. సోనియా కుటుంబం ముందుకు రేవంత్ రెడ్డి గులాం గిరీ చేస్తున్నారు” అని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..