కామారెడ్డి జిల్లాలో సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK' ఫైల్తో రూ.95,100 మాయం..
కామారెడ్డి జిల్లాలో సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK' ఫైల్తో రూ.95,100 మాయం..
Cyber crime


కామారెడ్డి, 07 జూన్ (హి.స.)

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ఒక దారుణమైన సైబర్ మోసం వెలుగుచూసింది. ఇక్కడికి చెందిన మల్హర్ అనే వ్యక్తి మొబైల్కు వాట్సాప్ ద్వారా ఒక సందేశం వచ్చింది. అది రవాణా శాఖ నుంచి వచ్చిన “ఈ-చలాన్ లాగా కనిపించింది. వాహనానికి చలాన్ పడిందని నమ్మిన ఆయన, ఆ మెసేజ్తో పాటు వచ్చిన apk ఫైల్ను క్లిక్ చేసి మొబైల్లో ఇన్స్టాల్ చేశారు. అంతే, ఆ యాప్ ఇన్స్టాల్ అయిన కొద్దిసేపటికే, ఆయనకు తెలియకుండానే ఆయన ఫోన్ పే ఖాతా నుండి ఏకంగా రూ.95,100 నగదు విడతల వారీగా మాయమైపోయింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఈ రకమైన మోసాలను Apk Malware Scam అంటారు. ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్ శాఖ లేదా కొరియర్ సర్వీస్ పేరిట నకిలీ వాట్సాప్ సందేశాలు పంపి, వాటితో పాటు యాప్ ఫైళ్లను పంపుతారు. గూగుల్ ప్లే స్టోర్ కాకుండా, బయట నుండి ఇలాంటి ఫైళ్లను ఇన్స్టాల్ చేయగానే మన ఫోన్ నియంత్రణ మొత్తం సైబర్ దొంగల చేతికి వెళ్తుంది. దీనివల్ల మనకు వచ్చే బ్యాంక్ ఓటీపీలు, రహస్య సమాచారాన్ని వారు సులభంగా దొంగిలించి, మన అకౌంట్ లోని డబ్బును కాజేస్తారు.

ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే వాట్సాప్లో తెలియని నంబర్ల నుండి వచ్చే ఎటువంటి లింకులను లేదా యాప్ ఫైళ్లను డౌన్లోడ్ చేయకూడదు. మీ వాహనానికి చలానా ఉందో లేదో తెలుసుకోవడానికి రవాణా శాఖ అధికారిక వెబ్సైట్లను మాత్రమే వాడాలి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande