
హైదరాబాద్, 07 జూన్ (హి.స.)
నగర శివార్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు (ఆదివారం) సాయంత్రం ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలకు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న కీలక సమస్యలను తీరుస్తూ, రికార్డు స్థాయిలో మొత్తం రూ.1,511 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. స్థానికులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో, సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.98 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన నూతన మల్కాజ్గిరి మునిసిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi