శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి మహార్దశ.. ప్రపంచ పర్యాటక కేంద్రంగా యాదగిరిగుట్ట!
శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి మహార్దశ.. ప్రపంచ పర్యాటక కేంద్రంగా యాదగిరిగుట్ట!
శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి మహార్దశ.. ప్రపంచ పర్యాటక కేంద్రంగా యాదగిరిగుట్ట!


హైదరాబాద్, 07 జూన్ (హి.స.)

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక-పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి ప్రత్యేక సాయం పథకం” కింద రూ.500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది. దీంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి మహార్దశ పట్టనుందిరాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి అతి చేరువలో ఉన్న యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం తెలంగాణలో ఆధ్యాత్మిక పర్యాటకానికి చిరునామాగా మారింది. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దే క్రమంలో ఇప్పటికే వేల కోట్ల రూపాయల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణం, పరిసర ప్రాంతాల అభివృద్ధి చేపట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు కేంద్ర నిధుల సహకారంతో మరింత భారీ ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది.

. ఆలయ పున నిర్మాణ సమయంలోనే ఆలయ సన్నిధిలో ప్రపంచస్థాయి పర్యాటకులకు వసతి కల్పనకు అవసరమైన ఫైవ్ స్టార్ స్థాయి సదుపాయాలతో కాటేజీలు, కన్వెన్షన్ సెంటర్లు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదించారు. అయితే నిధుల కొరతతో కేవలం ఆలయ పునర్నిర్మాణం, రహదారులు, ల్యాండ్ స్కేప్ గార్డెన్లు మాత్రమే అభివృద్ధి చేశారు. యాదగిరిగుట్టుకు వస్తున్న పర్యాటకులకు సరైన వసతి సదుపాయాలు అందుబాటులో లేకుండా పోయాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి, అధికారులతో సమీక్ష సందర్భంగా మౌలిక సదుపాయాలు, వసతి సౌకర్యాలపై చర్చించినప్పటికీ నిధుల కొరత ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం పర్యాటక ప్రాంతాలకు అందించే వడ్డీలేని మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేక సాయంలో నిధులను రాబట్టాలని భావిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande