
హైదరాబాద్, 07 జూన్ (హి.స.)
బత్తిని సోదరుల ఆధ్వర్యంలో నగరంలోని చారిత్రాత్మక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (Nampally Exhibition Grounds)లో జరగనున్న ప్రతిష్టాత్మక చేప ప్రసాదం' పంపిణీ కార్యక్రమాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు ఈ ప్రసాదం కోసం తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేదుకు గాను ముందస్తుగా ట్రాఫిక్ ప్రకటించారు. ఆంక్షలు విధిస్తున్నట్లుగా పోలీసులు
చేప ప్రసాదం పంపిణీ (Distribution of Fish Prasadam) కారణంగా రేపు ఉదయం 6 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకు నాంపల్లి, ఆ పరిసర ప్రాంతాలలో ఈ ట్రాఫిక్ ఆంక్షలు పూర్తిగా అమల్లో ఉంటాయి. కావున సాధారణ వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. అదేవిధంగా చేప ప్రసాదం కోసం వివిధ ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వచ్చే భక్తుల సౌకర్యార్థం పోలీసులు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను (Parking Lots) కేటాయించారు. కారు, భారీ ఫోర్ వాహనాలను గృహకల్ప, గగన్విహార్, చంద్రవిహార్ సమీపంలో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక బస్సులు, వ్యాన్లలో వచ్చే భక్తులు గాంధీభవన్, గృహకల్ప బస్ స్టాప్ల వద్ద దిగి, అక్కడి నుంచి కాలినడకన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు చేరుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. బైకులపై వచ్చే వారి కోసం మనోరంజన్ కాంప్లెక్స్, భీమ్రావ్ బాడా ప్రాంగణాల్లో ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. చివరగా ఆటోల్లో వచ్చే ప్రయాణికుల కోసం షెజాన్ హోటల్ వద్ద ఆటోలో దిగి లోపలికి వెళ్లే ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం పంపిణీ సజావుగా సాగేందుకు, ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు భక్తులు, నగర ప్రజలు పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..