అయోధ్య విరాళాల చోరీ- దేశవ్యాప్త సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టిన కేజ్రీవాల్
అయోధ్య విరాళాల చోరీ- దేశవ్యాప్త సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టిన కేజ్రీవాల్
Arvind Kejriwal ફાઇલ ફોટો


హైదరాబాద్, 12 జూలై (హి.స.)

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ ఘటనకు బాధ్యులైనవారిని శిక్షించాలని కోరుతూ ఆప్‌ సంతకాల సేకరణ చేపట్టింది. దిల్లీలో ఆప్‌ నిర్వహించిన సుందరకాండ పారాయణ కార్యక్రమంలో మాజీ సీఎం కేజ్రీవాల్‌, ఆప్‌ సీనియర్‌ నేత మనీశ్‌ సిసోదియా తదితరులు పాల్గొన్నారు. రామమందిరంలో కానుకల చోరీకి పాల్పడినవారికి కఠినశిక్ష పడాలని హనుమంతుడిని ప్రార్థించినట్లు కేజ్రీవాల్‌ చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సంతకాల సేకరణ చేపట్టినట్లు తెలిపారు. విరాళాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాపాడటానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో ప్రజలు కఠిన చర్యలు ఆశించగా, దానికి బదులుగా నిందితులను రక్షించే ప్రయత్నాలనే జరుగుతున్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా ఈ ఉద్యమంలో చేరాలని కేజ్రీవాల్​ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు, ఈ కేసులు న్యాయం జరిగే వరకు తన ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande