
న్యూ ఢిల్లీ, 12 జూలై (హి.స.)
దేశ రాజధాని ఢిల్లీలో భారీ హత్యకు కుట్ర పన్నిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టార్గెటెడ్ కిల్లింగ్కు ప్లాన్ చేసిన ముగ్గురు షూటర్లను ఢిల్లీ రోహిణి జిల్లా స్పెషల్ స్టాఫ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. విదేశాల్లో ఉన్న తమ నెట్వర్క్ నుంచి ఆదేశాలు అందుకుంటూ వీరు ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టుబడిన ఈ ముగ్గురికి గతంలో ఢిల్లీలో జరిగిన పలు కాల్పుల కేసులతోనూ ప్రత్యక్ష సంబంధం ఉందని, వీరంతా మోస్ట్ వాంటెడ్ నేరస్థులని అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా, గత వారం హర్యానాలో జరిగిన పోలీసు ఎన్ కౌంటర్లో ఓ జిమ్ ట్రైనర్ హత్య కేసులో వాంటెడ్గా ఉన్న బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన ఇద్దరు షూటర్లు (ప్రవేశ్, హిమాన్షు) హతమైన విషయం తెలిసిందే.
మరోవైపు, బిష్ణోయ్ గ్యాంగ్ అంతర్జాతీయ కార్యకలాపాలపై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్ బీఐ (FBI) సైతం కొరడా ఝుళిపిస్తోంది. ఉత్తర అమెరికాలో ఈ గ్యాంగ్ వ్యవహారాలు చూస్తున్న గోల్డ్ బ్రార్ ఆచూకీ తెలిపిన వారికి 50 వేల డాలర్ల (సుమారు రూ. 43 లక్షలు) భారీ బహుమతిని ప్రకటించింది. విపరీతమైన హింసాత్మక ఘటనలు, డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి నేరాలకు పాల్పడుతున్న అతడిపై 2026 జూలై 1న అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. భారత్కు చెందిన ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్వర్ను దెబ్బకొట్టేందుకు అమెరికా అధికారులు 'ఆపరేషన్ హార్డ్ బాల్' (Operation Hard Ball) పేరుతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. 2023లో కెనడాలో జరిగిన ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో పాటు పలు హింసాత్మక ఘటనలకు సంబంధించి అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్లపై అధికారికంగా అభియోగాలు నమోదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..