
రాజన్న సిరిసిల్ల, 17 జూలై (హి.స.)
గ్రామ పంచాయతీల అభివ్రుద్ధికి
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ గత పన్నేండేళ్లలో రూ. లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. గ్రామాల అభివ్రుద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా ఇయ్యడం లేదని పేర్కొన్నారు. పల్లె ప్రక్రుతి వనాలు, రైతు భరోసా కేంద్రాలు, స్మశానవాటికలుసహా గ్రామాల్లో జరిగిన అభివ్రుద్ధి అంతా కేంద్ర నిధులతోనేనని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా తెలంగాణలోని గ్రామాల్లో దాదాపు రూ.40 వేల కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. రూ.వేల కోట్లతో రోడ్లు నిర్మించినట్లు వివరించారు. సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గంభీరావుపేటలోని పొన్నాలపల్లిలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్ఏ) కింద కేంద్రం 20 లక్షలు, స్పెషల్ డెవలెప్ మెంట్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపీ, స్థానిక బీజేపీ నాయకులు, అధికారులతో కలిసి నూతన పంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు, బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు.
అనంతరం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పొన్నాలపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణమే కాదు, గ్రామాల్లో అంతో ఇంతో అభివ్రుద్ధి జరుగుతోందంటే ప్రియతమ ప్రధాని మోదీ ప్రభుత్వం ఇస్తున్న నిధులవల్లేనని మీకు తెలుసా? కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో గ్రామ పంచాయతీల అభివ్రుద్దికి ప్రత్యేకంగా ఎన్ని నిధులు కేటాయించిందో చెప్పగలదా? లేదు. ఎందుకంటే నయాపైసా ఇయ్యలేదు. మీ గ్రామంలో వేసిన సీసీ రోడ్డు, చెరువు పూడికతీత, అంగన్వాడీ భవనం, శ్మశానవాటిక, తాగునీటి పైప్లాన్, రోడ్డు... వీటన్నింటికీ పైసలిచ్చింది మోదీ ప్రభుత్వమే. గత 12 ఏళ్లలో తెలంగాణలోని గ్రామాల అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద దాదాపు 40 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి గ్రామాల్లో చెరువులను పునరుద్దరించినం. సీసీ రోడ్లు వేసినం. శ్మశానవాటికలు నిర్మించినం. లక్షలాది పేద కుటుంబాలకు ఉపాధి కల్పించినం. ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా దాదాపు 5 వేల కోట్ల రూపాయలతో గ్రామీణ రహదారులను నిర్మించినం. సీఆర్ఎఎఫ్ ద్వారా దాదాపు 6 వేల కోట్లతో గ్రామాలు, మండలాలు, పట్టణాల మీదుగా రోడ్లు నిర్మిస్తున్నం. జల్ జీవన్ మిషన్ ద్వారా దాదాపు 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతి ఇంటికి నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్నం. ఇవి గాకుండా మరెన్నో పథకాల ద్వారా వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రజలకు సౌకర్యాలను కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగు పర్చేందుకు క్రుషి చేస్తున్నం.నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నా.... గ్రామ పంచాయతీల అభివ్రుద్ధికి కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో లెక్కా పత్రంతో సహా వివరించేందుకు మేం సిద్దం. మరి రాష్ట్ర ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో ప్రత్యేకంగా ఎన్ని నిధులు ఖర్చు చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలి. బాధాకరమేందంటే కేంద్రం గ్రామాల అభివ్రుద్ధికి పైసలిస్తుంటే... వాటిని సిబ్బంది జీతభత్యాలు, శానిటేషన్ ఖర్చులకు డైవర్ట్ చేస్తున్నారు. పంచాయతీ సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉంది. అంతెందుకు ట్రాక్టర్లలో డీజిల్ పోయించడానికి కూడా డబ్బులివ్వడం లేదంటే ఆలోచించండి. గ్రామాల అభివ్రుద్ధి బీజేపీతోనే సాధ్యం. గ్రామాలు అభివ్రుద్ధి చెందితేనే దేశం బాగుపడుతుందని నమ్మి గ్రామాలకు పెద్ద ఎత్తున మోదీ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరుతున్నా అని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు