తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం తులం ఎంతుందంటే..
తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం తులం ఎంతుందంటే..
Gold


ముంబై, 02 జూలై (హి.స.)బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. ప్రతిరోజు గోల్డ్, సిల్వర్ ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే.. అయితే.. ఇరాన్ – అమెరికా యుద్ధం, అలాగే పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.. క్రమంలోనే.. బంగారం, వెండి ధరలు తగ్గుతుండటంతో కాస్త ఉపశమనం కలిగినట్లయింది. 10 రోజుల్లో బంగారం 10 గ్రాములపై రూ.6వేలు, అలాగే వెండి కిలోపై రూ.10వేల వరకు ధరలు తగ్గాయి.. గురువారం గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి.. పలు వెబ్సైట్ల ఆధారంగా.. జులై 2, 2026 ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధరపై రూ. 10 మేర తగ్గి.. రూ.1,40,770 గా ఉంది.22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.10 మేర తగ్గి.. రూ.1,29,040 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,40,100 లు గా ఉంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

హైదరాబాద్లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,770, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,29,040 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,40,770, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,29,040 ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande