'పరస్పర విశ్వాసమే అతిపెద్ద వ్యూహాత్మక ఆస్తి'- భారత్- జపాన్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీ
'పరస్పర విశ్వాసమే అతిపెద్ద వ్యూహాత్మక ఆస్తి'- భారత్- జపాన్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీ
japan pm


దిల్లీ, 02 జూలై (హి.స.) 'పరస్పర విశ్వాసమే అతిపెద్ద వ్యూహాత్మక ఆస్తి' అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్, జపాన్ దేశాలు రక్షణ రంగంలో మొట్టమొదటి సారిగా ఒక ఉమ్మడి ప్రాజెక్టుపై చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆయన తెలిపారు. దీనితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతికతలో సరికొత్త భాగస్వామ్యం కోసం ఇరు దేశాల ఒక ఉమ్మడి విజన్‌ను ఆవిష్కరించాయని చెప్పారు. దిల్లీలో జరిగిన భారత్-జపాన్ 16వ వార్షిక సదస్సులో జపాన్ ప్రధాని సనాయె తకాయిచితో కలిసి ప్రధాని మోదీ ఈ కీలక ప్రకటనలు చేశారు. జపాన్​ నాయకురాలు తన 'చెల్లెలు' అని మోదీ సంబోధించారు.

భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం భారత్‌కు విచ్చేసిన నా చెల్లెలు, జపాన్​ ప్రధాని సనాయె తకాయిచికి స్వాగతం పలుకుతున్నా. ఆమె జపాన్ మొట్టమొదటి మహిళా ప్రధాని, అలాగే దూరదృష్టి కలిగిన, ప్రజాదరణ పొందిన నాయకురాలు. ఆమె జపాన్‌లోని నారా ప్రిఫెక్చర్‌కు చెందినవారు. ఆ ప్రాంతం భారత్​, జపాన్ మధ్య ఉన్న ఉమ్మడి బౌద్ధ వారసత్వానికి ఒక కీలక కేంద్రంగా ఉంది. కొద్ది రోజుల క్రితం జరిగిన G7 శిఖరాగ్ర సమావేశంలో, ప్రపంచ సంక్షోభ సమయంలో పరస్పర విశ్వాసమే మన అత్యంత విలువైన వ్యూహాత్మక ఆస్తి అని నేను చెప్పాను. గత కొన్ని దశాబ్దాలుగా, ఆటోమొబైల్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు వివిధ రంగాల్లో భారత్​కు సహకారం అందించడంలో జపాన్ కీలక పాత్ర పోషిస్తోంది. నేడు, ప్రధాని పర్యటనతో ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో మేం ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. అంటూ మోదీ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande