జూలై 21 నుండి ఆగస్టు 21 పార్లమెంట్ సమావేశాలు
జూలై 21 నుండి ఆగస్టు 21 పార్లమెంట్ సమావేశాలు
PARLIAMENT BUDGET SESSION


న్యూఢిల్లీ:, 02 జూలై (హి.స.)

భారత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల (Monsoon Session) షెడ్యూల్ ఖరారైంది. ఈ ఏడాది జూలై 21 నుండి ఆగస్టు 21 వరకు ఒక నెల రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సమావేశాల నిర్వహణ ప్రతిపాదనకు గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని ఆయన ట్విట్టర్ (X) ద్వారా వెల్లడించారు. అయితే, ఆగస్టు 13, 14 తేదీలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉభయసభలకు సెలవు ఉంటుందని, ఆ రోజుల్లో ఎటువంటి సిట్టింగ్స్ ఉండవని మంత్రి స్పష్టం చేశారు. గత బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 18 వరకు సుదీర్ఘంగా సాగిన నేపథ్యంలో, ఈ వర్షాకాల సమావేశాలలో ప్రభుత్వం పలు కీలక బిల్లులను చట్టాలుగా మార్చడానికి ఉభయసభల ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చట్టసభల్లో ప్రజాసమస్యలపై చర్చలతో పాటు, రాబోయే బిల్లులపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ సెషన్‌లో తీవ్ర చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande