
అనకాపల్లి పట్టణం, 29 జూలై (హి.స.)
: అనకాపల్లిలో గురు పౌర్ణమి పురస్కరించుకొని బుధవారం పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనకాపల్లిలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. శాకంబరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనకాపల్లి జిల్లా గవరపాలెంలోని కనకదుర్గాలయంలో అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ