
హైదరాబాద్, 29 జూలై (హి.స.)తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, నదులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పంటలు నీటమునిగాయి. పలు చోట్ల వరద ఉద్ధృతికి రహదారులు కొట్టుకుపోయాయి. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జలాశయాలు నిండి పోయి జలకళను సంతరించుకున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలతో భూపాలపల్లి జిల్లా తడిసిముద్దవుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్